WhatsApp: అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం

  • ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా దేశాల కోడ్లతో ఫోన్లు
  • ఈ విషయంపై వాట్సప్ కు నోటీసులు జారీచేస్తామన్న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ
  • వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు డిజిటల్ వేదికలే బాధ్యత వహించాలని స్పష్టీకరణ
Centre To Send Notice To WhatsApp Over International Spam Calls Issue

గుర్తుతెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి స్పాం కాల్స్‌ వస్తున్నాయన్న అంశంపై వాట్సప్‌ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. వినియోగదారుల భద్రతను నిర్ధారించే బాధ్యత డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌లపై ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చే ప్రతి అంశంపై ప్రభుత్వం ప్రతిస్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వారి భద్రత, గోప్యతకు భంగం కలగకుండా డిజిటల్‌ వేదికలే బాధ్యత వహించాలని స్పష్టమైన సందేశాల్ని పంపుతున్నట్టు ఆయన చెప్పారు.  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారుల భద్రతకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్పామ్ కాల్స్ సమస్యపై మంత్రిత్వ శాఖ దృష్టి పెడుతుందని తెలిపారు. 

అంతర్జాతీయ స్పామ్ కాల్స్ వస్తున్న వాట్సప్ నంబర్లను మొదట ఎలా గుర్తించి యాక్సెస్ చేస్తున్నారు? దీని కోసం డేటాబేస్‌లు ఉపయోగిస్తున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత్ లోని వాట్సప్ వినియోగదారులకు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ స్పామ్ కాల్స్ ప్రధానంగా ఇండోనేషియా (62), వియత్నాం (84), మలేషియా (60), కెన్యా (254), ఇథియోపియా (251) దేశ కోడ్‌లతో వస్తున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.

More Telugu News