ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయం బయటపెట్టిన సురేష్ రైనా
- ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఏడాది ఆడతానని చెప్పాడన్న సురేష్ రైనా
- ఫిట్ గా ఉన్నాడనీ, బాగా ఆడుతున్నాడనీ ప్రశంస
- ధోనీ భారత క్రికెట్ కోసం ఆడుతూనే ఉండాలన్న రైనా
టీమిండియాలోనూ ధోనీ సహచరుడిగా రైనా చాలా ఏళ్లు సేవలు అందించాడు. జియో సినిమా ఛానల్ లో ఐపీఎల్ వ్యాఖ్యాతగా సేవలు అందిస్తున్నాడు. ధోనీతో తన చివరి భేటీ గురించి కూడా చెప్పాడు. ‘‘ట్రోఫీని గెలుచుకున్న తర్వాత నేను మరో ఏడాది పాటు ఆడతాను’’ అని ధోనీ తనతో చెప్పినట్టు రైనా తాజాగా జియో సినిమాకి వెల్లడించాడు. సీఎస్కే కెప్టెన్ ఐపీఎల్ వ్యూహం గురించి, ఐదో టైటిల్ గెలుచుకునే విషయంలో అతడి నమ్మకాన్ని ప్రస్తావించాడు. ‘‘అతడు చూడ్డానికి ఫిట్ గా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లేదా భారత క్రికెట్ కు ఆడడాన్ని అతడు కొనసాగించాలి. ఎంతో మంది ఆటగాళ్లు అతడి నుంచి నేర్చుకుంటున్నారు. రిటైర్మెంట్ అనేది అతడు తీసుకోవాల్సిన నిర్ణయం’’ అని రైనా వివరించాడు.