Abhiram: దగ్గుబాటి అభిరామ్ 'అహింస' .. రిలీజ్ డేట్ ఖరారు!

Ahimsab release date cinfirmed
షార్ట్స్‌లో చూడండి
ప్రేమకథా చిత్రాలపై తేజ మార్కు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమకథా చిత్రాల ద్వారా ఆయన చాలామంది హీరోలను పరిచయం చేశాడు. అలా ఇప్పుడు ఆయన మరో ప్రేమకథగా 'అహింస'ను థియేటర్లకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు.

ఆనంది ఆర్ట్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో, హీరోయిన్ గా గీతిక పరిచయమవుతోంది. ఈ సినిమా ఈ పాటికే థియేటర్లకు రావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన రిలీజ్ విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అనే విషయం టీజర్ .. ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ ప్రేమకథా చిత్రం మరో ట్రెండ్ ను సృష్టిస్తుందేమో చూడాలి.

Go Back to Shorts
Abhiram
Geethika
Teja
Ahimsa Movie

More Telugu News