kolkata: సెంటిమెంట్ ఫలించి... కోల్‌కతాపై గెలిస్తే పంజాబ్ ఏడు నుండి మూడో స్థానానికి...!

  • ఒక మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్ గెలుస్తూ వస్తోన్న పంజాబ్
  • సొంత మైదానంలో ఓడిపోయి, ప్రత్యర్థి మైదానంలో గెలుస్తున్న పంజాబ్
  • గత మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలుస్తుందని పంజాబ్ అభిమానుల ఆశ
KKR vs PBKS Todays 53rd ipl Match

కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి ఐపీఎల్ 53వ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ ముందుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది. పంజాబ్, కోల్‌కతా జట్లు వరుసగా 7, 8వ స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్‌లకు కూడా నేటి మ్యాచ్ లో గెలుపు ఎంతో కీలకం. 

ప్లేఆఫ్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి టీమ్ కు ప్రతి మ్యాచ్ కీలకమే. క్రికెట్ ఆడేవారికి లేదా చూసేవారికి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ సెంటిమెంట్ ఆధారంగా ఒక టీమ్ గెలుస్తుందని అంచనాకు వస్తుంటారు.

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఓ సెంటిమెంట్ నిజమైతే పంజాబ్ విజయం ఖాయమంటున్నారు ఆ జట్టు అభిమానులు. ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ రెండు వరుస మ్యాచ్ లలో గెలిచి, ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఆ తర్వాత నుండి ఒక మ్యాచ్ గెలుస్తూ, మరో మ్యాచ్ ఓడిపోతోంది. చివరి మ్యాచ్ పంజాబ్ ఓడిపోయింది. ఈ సెంటిమెంట్ ఆధారంగా... ఇవాళ కోల్‌కతాతో జరిగే మ్యాచ్ లో గెలుస్తుందని పంజాబ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కోల్‌కతాపై గెలిస్తే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకుతుంది. పంజాబ్ సొంత మైదానంలో ఓడిపోయి, ప్రత్యర్థి మైదానంలో గెలుస్తుండటం గమనార్హం. 

పాయింట్ల పట్టికలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ 11 మ్యాచ్ లకు గాను 8 గెలిచింది. చెన్నై 11 ఆడి 6, లక్నో 11 ఆడి 5, రాజస్థాన్ రాయల్స్ 11 ఆడి 5, బెంగళూరు, ముంబై, పంజాబ్ జట్లు 10 మ్యాచ్ ల చొప్పున ఆడి 5 మ్యాచ్ లు గెలిచాయి. కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ పది మ్యాచ్ ల చొప్పున ఆడి వరుసగా 4, 3, 4 మ్యాచ్ లు గెలిచాయి.

More Telugu News