ఏమి చూడాలన్నది ప్రజల ఇష్టానికి వదిలేయాలి: ఖుష్బూ
- తమిళనాడులో కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనల నిషేధం
- తమిళనాడు థియేటర్ల సంఘం స్వీయ నిర్ణయం
- దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఖుష్బూ సుందర్
‘‘తమిళనాడు ప్రభుత్వం కేరళ స్టోరీస్ ప్రదర్శనల రద్దుకు కుంటి సాకులు చెబుతోంది. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ప్రజలు తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు. కేరళ స్టోరీస్ నిషేధం కోసం పోరాడే వారిని ఏమి భయపెడుతుందో ఆశ్చర్యంగా ఉంది. నిర్మొహమాటంగా నిజం చెప్పడమా లేక సంవత్సరాలుగా తెలియకుండా లేదా తెలిసినా మౌనంగా నిజంలో భాగం అయ్యామన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నందుకా?’’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు. భద్రతా కారణాలను చూపిస్తూ మే 7 నుంచి కేరళ స్టోరీస్ సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని థియేటర్ల సంఘం నిర్ణయించడం గమనార్హం.