BJP: మణిపూర్ హింసపై ఎట్టకేలకు మౌనం వీడిన అమిత్ షా..!

  • రాష్ట్రంలో  పరిస్థితి అదుపులోనే ఉందన్న హోం మంత్రి
  • రిజర్వేషన్ల విషయంలో షెడ్యూల్ తెగ, ఇతరుల మధ్య గొడవలు
  • ఇప్పటిదాకా  54 మంది మృతి
 Home minister Amit Shah breaks silence on Manipur violence

రిజర్వేషన్ల విషయంలో హింస చెలరేగిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. కర్ఫ్యూ విధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ ఇంగ్ల చానెల్ తో మాట్లాడిన షా.. మెయితీకులానికి షెడ్యూల్డ్ తెగ- హోదా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మణిపూర్ ప్రభుత్వం అన్ని వాటాదారులను సంప్రదిస్తుందని హామీ ఇచ్చారు.

‘రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై సంబంధిత వర్గాలందరితో చర్చ జరుగుతుంది. సంప్రదింపుల తర్వాత మణిపూర్ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఏ వ్యక్తి, వర్గం భయపడాల్సిన అవసరం లేదు’ అని షా అన్నారు. 

ఇదిలావుంచితే, మణిపూర్‌లో హింస కారణంగా ఇప్పటిదాకా 54 మంది మరణించారు. వేలాది మంది ప్రజలు ప్రాంతాలను విడిచివెళ్లారు. 23 వేల మందికి పైగా నిర్వాసిత ప్రజలు ప్రస్తుతం సైనిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. హింస చెలరేగడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కర్ఫ్యూను విధించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త ప్రశాంతత నెలకొంది. 

More Telugu News