Nara Lokesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం: నారా లోకేశ్

Will establish High Court bench in Kurnool says Nara Lokesh
  • కర్నూలులో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • జిల్లా కోర్టు భవనం వద్ద లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించిన న్యాయవాదులు
  • జగన్ పై విమర్శలు కురిపించిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలులో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఆయన కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. తమది జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ హామీపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Telugudesam
Kurnool
Yuva Galam Padayatra

More Telugu News