bus accident: ఉత్తరప్రదేశ్ లో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం

5 Dead and 15 Injured After Bus Overturned By Unknown Vehicle In UP
  • గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టిన బస్సు
  • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
  • జాలౌన్ జిల్లాలోని గోపాల్ పురలో శనివారం రాత్రి ప్రమాదం
ఉత్తరప్రదేశ్ లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల వివరాల ప్రకారం..

పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సును జాలౌన్ జిల్లాలోని గోపాల్ పుర ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ఓ పెళ్లికి హాజరై తిరిగివెళ్తున్నారని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడడంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పదిహేను మందికి గాయాలు కావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. బస్సులోని మిగతా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాధోగఢ్ పోలీసులు తెలిపారు.
bus accident
Uttar Pradesh
jalaun
bus overturned

More Telugu News