Tollywood: నేతాజీ మిస్సింగ్​ మిస్టరీ నేపథ్యంలో నిఖిల్ ‘స్పై’

 Nikhil Siddhartha SPY locks its release date

  • కార్తికేయ2 తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్
  • గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో స్పై చేస్తున్న యువ హీరో
  • ఈ నెల 12 టీజర్.. జూన్ 29న సినిమా విడుదల

‘కార్తికేయ 2’ భారీ విజయంతో ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్ సిద్దార్థ. అతను హీరోగా తెరకెక్కుతున్న మరో ప్యాన్ ఇండియా మూవీ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  జూన్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల 12న టీజర్ ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. శనివారం వీడియో గ్లింప్స్‌ ను విడుదలచేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. 

ఇందులో గూఢచారిగా నిఖిల్ లుక్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. దేశ చరిత్రలో అత్యంత రహస్యంగా ఉన్న నేతాజీ మిస్సింగ్ మిస్టరీని ఇందులో రివీల్ చేయనున్నారు. దీంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

More Telugu News