వైసీపీని వీడే మంత్రుల జాబితాలో ఉషశ్రీ ముందుంటారు: అనిత

Anitha questions Minister Usha Sricharan on ap development
  • నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్న టీడీపీ నేత
  • అభివృద్ధి జరిగితే ప్రజలు చెప్పులు ఎందుకు విసురుతున్నారని వ్యాఖ్య
  • గడపగడపకు కార్యక్రమంలో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్న వంగలపూడి
ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పాలని తెలుగు దేశం పార్టీ నేత వంగలపూడి అనిత శనివారం డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై ప్రజలు చెప్పులు కూడా ఎందుకు విసురుతున్నారో చెప్పాలన్నారు. మున్ముందు వైసీపీని వీడే మంత్రుల జాబితాలో ఉషశ్రీ చరణ్ ముందుంటారన్నారు.
Advertisement
Anitha
YSRCP

More Telugu News