షారుఖ్ 'జవాన్' రిలీజ్ డేట్ ఖరారు!
- షూటింగు దశలో షారుఖ్ 'జవాన్'
- సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న భారీ సినిమా
- కీలకమైన పాత్రలో నయనతార
- సెప్టెంబర్ 7వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితమే ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. షారుఖ్ కెరియర్ లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచేలా అట్లీకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ సినిమాలో నయనతార .. విజయ్ సేతుపతి ... ప్రియమణి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంజయ్ దత్ ... విజయ్ .. అల్లు అర్జున్ .. దీపిక పదుకొణే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్టుపైనే కసరత్తు చేస్తూ వచ్చిన అట్లీ కుమార్, ఏ రేంజ్ హిట్ ను అందిస్తాడనేది చూడాలి.