Google: గూగుల్ ప్రధాన కార్యాలయం పైనుంచి దూకి యువ టెకీ ఆత్మహత్య!

  • న్యూయార్క్ నగరంలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో షాకింగ్ ఘటన
  • కార్యాలయం వద్ద నేలపై అపస్మారక స్థితిలో పడిఉన్న ఉద్యోగి
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ప్రకటన
  • కార్యాలయం 14వ అంతస్తు అంచుపై మృతుడి ఫింగర్ ప్రింట్స్
  • టెకీ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసుల అనుమానం
Google engineer commits suicide jumps to his death from office building in NYC

న్యూయార్క్ నగరంలో ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (31) గూగుల్ ప్రధాన కార్యాలయం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 14వ అంతస్తు నుంచి దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడన్న సమాచారంపై పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేలపై అచేతనంగా పడి ఉన్న అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే, గూగుల్ కార్యాలయం 14వ అంతస్తు అంచుపై టెకీ చేతి వేలి ముద్రలు లభించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

టెకీ మరణ వార్త అతడి కుటుంబానికి ఇంకా చేరకపోవడంతో మృతుడి వివరాలను పోలీసులు బహిర్గతం చేయలేదు. మరోవైపు, ఈ ఘటనపై గూగుల్ ఇంకా స్పందించాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం ఇదే కార్యాలయంలోని ఓ గూగుల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాట్(33) తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకున్నాడు. దీంతో, గూగుల్‌ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

More Telugu News