బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే

We are going ahead to defeat BJP says Mallikarjun Kharge
  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు
  • ఈసారి హంగ్ వచ్చే అవకాశమే లేదన్న ఖర్గే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి హంగ్ వచ్చే అవకాశమే లేదని... కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమిపాలయితే తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. 

ఎన్నికల నేపథ్యంలో తాను సుడిగాలి పర్యటనలు చేస్తున్నానని... సాయంత్రం సభల్లో పాల్గొనడానికి 100 కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడానికే అన్ని కష్టాలను భరిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ప్రధాని మోదీ కూడా వరుస ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Go Back to Shorts
Mallikarjun Kharge
Congress
Karnataka
Elections

More Telugu News