సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు
- వైసీపీలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి
- ఇద్దరికీ పార్టీ కండువాలు కప్పిన సీఎం జగన్
- సాదరంగా వైసీపీలోకి ఆహ్వానం
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డిలను సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు.