Nara Lokesh: జగన్ ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ ఉంటుంది: నారా లోకేశ్

Nara Lokesh alleges scam in MDU
  • పాణ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ఎండీయులో కమీషన్ల కోసమే రూ.536 కోట్లు ఇచ్చారని వ్యాఖ్య
  • టీడీపీ అధికారంలోకి వస్తే ఎండీయు వ్యవస్థను సమీక్షిస్తామని వెల్లడి
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన యువగళం పాదయాత్ర పాణ్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా అందులో స్కామ్ ఉంటుందని ఆరోపించారు.

కమీషన్ల కోసమే ఎండీయూలో వాహనాల కొనుగోలుకు రూ.536 కోట్లు ఇచ్చారన్నారు. ఆపరేటర్లకు ప్రతి సంవత్సరం వేతనాల రూపంలో రూ.250 కోట్లు వృథా చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఎండీయూ వ్యవస్థను సమీక్షిస్తామన్నారు. ప్రజలకు, డీలర్లకు సౌలభ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.
Nara Lokesh
YS Jagan

More Telugu News