ap inter board: ఏపీలో జూనియర్‌ కాలేజీలకు షాక్.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

  • జరిమానాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు
  • కాలేజీని ఇంకోచోటుకు అనుమతి లేకుండా మార్చితే విధించే జరిమానా 5 రెట్లు పెంపు
  • మహిళా కాలేజీగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తే రూ.2 లక్షల ఫైన్
ap inter board warns junior colleges they will be fined heavily if they violate rules

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ విద్యా మండలి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే ఇంటర్ ప్రైవేటు కాలేజీలకు భారీ జరిమానాలు విధించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న జరిమానాలను దాదాపు 5 రెట్ల దాకా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

మండలం, మున్సిపాలిటీల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా కళాశాలను మార్చితే విధించే జరిమానా రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. మండలం నుంచి మండలానికి, మండలం నుంచి పురపాలక, నగరపాలక ప్రాంతానికి అనధికారికంగా మార్చితే విధించే జరిమానాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు మార్పు చేసినా రూ.5 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మహిళా కళాశాలగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తే రూ.రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News