కుమారుడు X Æ A XII మూడో పుట్టిన రోజున మస్క్ ట్వీట్

Elon Musk son birthday with super cute
  • గాయని గ్రిమ్స్ తో కలిగిన మొదటి సంతానం
  • కుమారుడితో కలసి ఉన్న ఫొటో షేర్
  • నాలుగో పుట్టిన రోజూ నీతోనే అంటూ ట్వీట్
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ ప్రజలకు సుపరిచితుడు. ఏది చేసినా భిన్నంగా ఉండాలని ఆయన కోరుకుంటుంటారు. తన ఉత్పత్తులు, కంపెనీ సేవల్లో ప్రత్యేకత కోసం మస్క్ కృషి చేస్తుంటారు. తన కుమారులకు సైతం ఆయన వెరైటీగా, ప్రపంచంలో మరెవరూ పెట్టుకోలేని విధంగా నామకరణాలు చేసేశారు. ఎలాన్ మస్క్ కు ముగ్గురు మహిళలతో మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. ఒకరు చిన్నతనంలోనే మరణించారు. 

వీరిలో X Æ A-XII అనే బాలుడి మూడో పుట్టిన రోజు సందర్భంగా ఓ గిఫ్ట్ బాక్స్ తో కుమారుడితో కలసి ఉన్న ఫొటోను మస్క్ ఈ నెల 4న ట్విట్టర్లో షేర్ చేశారు. ‘4వ పుట్టిన రోజు నాడు కూడా నీతోనే’ అని ట్వీట్ చేశారు. మస్క్ మొదటి కుమారుడి పేరు నెవడా అలెగ్జాండర్. ఎలాన్ మస్క్ తాజా పోస్ట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గాయని గ్రిమ్స్ తో కలిగిన మొదటి సంతానం X Æ A-XII. 2020 మే 4న జన్మించాడు. వీరిద్దరికీ వై అనే పేరుతో కుమార్తె కూడా ఉంది.
Go Back to Shorts
Elon Musk
son
birthday
X Æ A XII

More Telugu News