AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు జైలుశిక్ష విధించిన ఏపీ హైకోర్టు

  • ఆర్టీసీలో ఫీల్డ్ మన్లను క్రమబద్ధీకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు
  • తమ ఆదేశాలు బుట్టదాఖలు చేశారంటూ ఆగ్రహం
  • ఐదుగురు అధికారులకు నెల రోజుల జైలు శిక్ష
  • రూ.1000 చొప్పున జరిమానా 
AP High Court sentenced five officials in contempt of court charges

ఏపీకి చెందిన పలువురు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీలో ఫీల్డ్ మన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తమ ఆదేశాలను అమలు చేయకపోవడం హైకోర్టును ఆగ్రహానికి గురిచేసింది. 

ఈ నేపథ్యంలో, ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 2వ తేదీన ఆదేశాలు  వెలువరించింది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుకు నెల రోజుల జైలుశిక్ష విధించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారులకు కూడా నెల రోజుల జైలు శిక్ష విధించింది. ఈ ఐదుగురు అధికారులకు రూ.1000 చొప్పున జరిమానా కూడా విధించింది.

హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఫీల్డ్ మన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది. ఈ నెల 16 లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని సదరు అధికారులను ఆదేశించింది.

More Telugu News