KCR: ఇస్కాన్ టెంపుల్ కు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

  • కోకాపేటలో విశాలమైన ప్రాంగణంలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం
  • ఈ నెల 8న శంకుస్థాపన కార్యక్రమం
  • కొత్త సచివాలయంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వానించిన ఇస్కాన్ ప్రతినిధులు
KCR to attend ground break ceremony of ISKCON temple

హైదరాబాద్ నగరానికి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కట్టడం రాబోతోంది. కోకాపేట్ లో అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతి పెద్ద ఆలయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైనత్య సంఘం (ఇస్కాన్) నిర్మించబోతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ నమూనాను ఇస్కాన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ కట్టడంలో శ్రీరాధాకృష్ణ టెంపుల్, శ్రీనివాస గోవింద టెంపుల్, రాజగోపురం, నిత్యాన్నదాన హాలు ప్రధానంగా ఉంటాయి. నూతన సచివాలయంలో కేసీఆర్ ను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపనకు ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని వారికి కేసీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News