YS Sharmila: ఈ ట్రక్కును కేసీఆర్ కు గిఫ్టుగా పంపిస్తున్నాం: షర్మిల

Sharmila says they are sending a truck with damaged crops to KCR
  • తెలంగాణలో అకాలవర్షాలు
  • నష్టపోయిన రైతులు
  • రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్న షర్మిల
  • రైతులు నష్టపోయిన పంటతో కూడిన ట్రక్కును కేసీఆర్ కు పంపుతున్నామని వెల్లడి
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేసీఆర్ సర్కారు ఆదుకోవడంలేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ క్రమంలో ఆమె వినూత్న కార్యాచరణ చేపట్టారు. రైతులు నష్టపోయిన పంటతో కూడిన ఓ ట్రక్కును రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కు గిఫ్టుగా పంపిస్తున్నట్టు తెలిపారు. 

ఈ ట్రక్కులో ఉన్నది నష్టపోయిన పంట మాత్రమే కాదని, రైతుల కన్నీరు అని పేర్కొన్నారు. పుస్తెలు కుదువపెట్టి పండిస్తే మిగిలింది ఇదేనని వెల్లడించారు. ఇది చూసైనా రైతులకు సాయం చేయాలన్న జ్ఞానం కలుగుతుందేమో అని షర్మిల వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ ఇకనైనా ఫామ్ హౌస్ మత్తు వీడాలని అన్నారు. కేసీఆర్ అంటేనే కరప్షన్ అని, బంగారు తెలంగాణ ఆయన కుటుంబానికే అయింది తప్ప, ప్రజలకు కాదని విమర్శించారు.
YS Sharmila
Truck
KCR
Farmers
Rains
YSRTP
BRS
Telangana

More Telugu News