KCR: రైతు బీమా తరహాలో గీత కార్మికులకు కేసీఆర్ సరికొత్త పథకం

kCR planning to Kallu geetha beema scheme
  • కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే గీత కార్మికుల బీమా
  • రూ.5 లక్షల బీమా సాయం నేరుగా బ్యాంకు ఖాతాలోకి...
  • విధివిధానాల రూపకల్పన కోసం ఆదేశాలు
తెలంగాణలో రైతు బీమా తరహాలో కల్లుగీత కార్మికులకు 'గీత కార్మికుల బీమా' పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గీత కార్మిక బీమా పథకం పైన చర్చించారు.

కల్లు గీత కార్మిక బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ఆదేశించారు ముఖ్యమంత్రి. కల్లు గీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
KCR
BRS

More Telugu News