మల్లాది విష్ణుకు మాతృవియోగం... సీఎం జగన్ పరామర్శ
- చికిత్స పొందుతూ మరణించిన విష్ణు తల్లి బాలాత్రిపుర సుందరమ్మ
- బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
- ముఖ్యమంత్రి వెంట మంత్రి జోగి రమేశ్
ఈ నేపథ్యంలో, సీఎం జగన్ విజయవాడ ఎంజీ రోడ్ లోని మల్లాది విష్ణు నివాసానికి వచ్చారు. తల్లి మరణంతో బాధపడుతున్న మల్లాది విష్ణును పరామర్శించారు. బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అక్కడున్న ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రి జోగి రమేశ్ కూడా ఉన్నారు.