ప్రభుత్వాలకు ఆసక్తి లేదు: నంది అవార్డులపై నిర్మాత ఆదిశేషగిరి రావు కీలక వ్యాఖ్యలు

Adiseshagiri rao hot comments on Nandi Awards
  • తమకు అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు ఇస్తున్నారన్న నిర్మాత
  • రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదని వ్యాఖ్య 
  • హీరో కృష్ణ పేరుపై మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్న శేషగిరిరావు
నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆసక్తి లేదన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే అవార్డులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవార్డులకు ఇప్పుడు అంతగా ప్రాధాన్యత ఉందని తాను అనుకోవడం లేదన్నారు. నంది అవార్డుల కంటే సంతోషం అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.

హీరో కృష్ణ పేరుపై మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు ను రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పద్మాలయా బ్యానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమన్నారు.
Go Back to Shorts
nandi awards

More Telugu News