ghattamaneni krishna: 4Kలో సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్

Mosagallaku Mosagadu Set to RELOAD in theatres worldwide on MAY 31st
  • భారత తొలి కౌబాయ్ చిత్రంలో నటించిన దివంగత కృష్ణ
  • ఆయన జయంతి సందర్భంగా మే31న చిత్రం రీ రిలీజ్
  • ప్రకటించిన నిర్మాత ఆదిశేషగిరిరావు
తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగత సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక స్థానం. నటుడిగా, నిర్మాతగా తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేశారాయన. భారత చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోలు, దర్శకుల పుట్టిన రోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ చిత్రాలు కొత్త హంగులతో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి. ఈ జాబితాలో మోసగాళ్లకు మోసగాడు చిత్రం చేరనుంది. మే 31 నాడు కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం తొలుత 1971, ఆగస్ట్ 27న విడుదలై అప్పట్లో క్లాసిక్ హిట్ గా నిలిచింది. తాజాగా 4కే క్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ఆదిశేషగిరిరావు ప్రకటించారు. రీ రిలీజ్ పోస్టర్లను విడుదల చేశారు.
ghattamaneni krishna
Mosagallaku Mosagadu
4k
re release
May 31st

More Telugu News