10 రోజుల్లో 'విరూపాక్ష' ఎంత వసూలు చేసిందంటే!

Virupaksha Movie Update
  • సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
  • 4 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు  
  • 10 రోజుల్లో 76 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్
సాయితేజ్ ఇంతవరకూ లవ్ .. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. మొదటిసారిగా ఆయన హారర్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో 'విరూపాక్ష' చేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 

సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. తొలి రోజున 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నిన్నటితో ఈ సినిమా 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా 76 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. 

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'ఏజెంట్' ..'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలు కూడా 'విరూపాక్ష' వసూళ్లను ప్రభావితం చేయలేకపోయాయి. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Advertisement
Saitej
Samyuktha Menon
Virupaksha

More Telugu News