Corona Virus: దేశంలో కొత్తగా 5,874 కరోనా కేసులు

  • నిన్నటితో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల
  • గత 24 గంటల్లో కొత్తగా 5,874 కేసులు నమోదు
  • 50 వేల దిగువకు యాక్టివ్ కేసుల సంఖ్య
  • జాతీయ రికవరీ రేటు 98.71 శాతం
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
India logs 5874 new Covid19 cases in last 24 hrs

భారత్‌లో మరోమారు కరోనా రోజువారీ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 5,874 కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. దీంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ రోగుల సంఖ్య 50 వేల మార్కు దిగువకు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 49,015గా ఉంది. శనివారం నాడు రోజువారీ కేసుల సంఖ్య 7,171గా ఉన్న విషయం తెలిసిందే. 

ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 3.31శాతంగా, వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 కోలుకున్నారు. దీంతో, ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.

More Telugu News