Christina Ashten Gourkani: ఇంకా అందం కావాలంటూ మరో ప్లాస్టిక్ సర్జరీ... వికటించడంతో మృతి

US Model Christina Ashten Gourkani dies after a plastic surgery
  • కిమ్ కర్డాషియన్ లా కనిపించిన గౌర్కానీ కన్నుమూత
  • ఓ ప్లాస్టిక్ సర్జరీ అనంతరం గుండెపోటు
  • గౌర్కానీ స్వస్థలం కాలిఫోర్నియా.. మోడల్ గా గుర్తింపు
  • కిమ్ కర్డాషియన్ ను పోలి ఉండడంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్
సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ కిమ్ కర్డాషియన్. అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. 

కిమ్ కర్డాషియన్ లా వయ్యారం ఒలకబోయాలని, ఆమెలా కనిపించాలని అనేకమంది అమ్మాయిలు తహతహలాడుతుంటారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నారు. అమెరికాకు చెందిన క్రిస్టినా ఆష్టన్ గౌర్కానీ కూడా ఈ కోవలోకే వస్తుంది. 

గౌర్కానీ స్వస్థలం కాలిఫోర్నియా. మోడలింగ్ ద్వారా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సర్జరీల అనంతరం అచ్చం కిమ్ కర్డాషియన్ లా ఉందే అనిపించుకుని మురిసిపోయింది. కిమ్ కర్డాషియన్ ను పోలి ఉండడంతో ఆమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమలో 34 ఏళ్ల గౌర్కానీ... మరో సర్జరీ చేయించుకుని, అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. 

ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం గౌర్కానీ తీవ్ర గుండెపోటుకు గురైందని, ఆమె మరణానికి కారణం అదేనని తెలిపారు. సర్జరీ నేపథ్యంలో, గుండె పనితీరుకు అవాంతరాలు ఏర్పడ్డాయని, గుండె ఆరోగ్యం క్షీణించడానికి నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కారణమని మేయో క్లినిక్ వర్గాలు వెల్లడించాయి.
Christina Ashten Gourkani
Kim Kardashian
Plastic Surgery
Death
USA

More Telugu News