Jeff Bezos: జెఫ్ బెజోస్ ధరించిన షర్ట్ విలువ రూ. 980 మాత్రమేనా?

Huge discussion on Jeff Bezos dress rate
  • ఇటీవల తన ప్రేయసితో కలిసి ఒక ఈవెంట్ కు హాజరైన బెజోస్
  • ఇద్దరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ధరించిన షర్ట్
శ్రీమంతులు వాడే ప్రతిదీ ఎంతో కాస్ట్లీగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి అది నిజం కూడా కావచ్చు. తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ధరించిన ఒక షర్ట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్ లో బెజోస్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆయన ప్రేయసి కూడా ఈవెంట్ కు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి హుషారుగా డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇక ఈ సందర్భంగా బెజోస్ ధరించిన షర్ట్ అమెజాన్ లో 12 డాలర్లకు లభిస్తోందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అంటే మన కరెన్సీలో అటూఇటుగా రూ. 980 అన్నమాట. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం బెజోస్ ను ప్రశంసిస్తున్నారు. ప్రపంచ శ్రీమంతుడై ఉండి ఎంతో సింపుల్ గా ఉన్నారని కితాబునిస్తున్నారు.
Jeff Bezos
Shirt
Amazon

More Telugu News