Shirdi: హైదరాబాద్ నుంచి షిర్డీకి స్పెషల్ టూర్ ప్యాకేజీ

Hyderabad to Shirdi tour package by Telangana Tourism
  • తక్కువ ధరలో తీసుకొచ్చిన తెలంగాణ పర్యాటక శాఖ 
  • సిటీలో పలు పికప్ పాయింట్ల నుంచి బస్సులు
  • బాబా దర్శనం, భోజనం ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాల్సిందే!
షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి తక్కువ ధరలో ప్యాకేజీ ప్రకటించింది. రెండు రాత్రులు, ఒక పగలు సాగే ఈ టూర్ ను ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలుగా విభజించింది. ఏసీ బస్సులో ప్రయాణానికి పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010 గా టికెట్ ధరలు ఖరారు చేసింది. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించాలంటే పెద్దలు రూ.2,400, పిల్లలకు రూ.1,970 గా టికెట్ ధర నిర్ణయించింది. 

టూర్ సాగేదిలా..
హైదరాబాద్ లోని వివిధ పికప్ పాయింట్ల నుంచి సాయంత్రం బస్సులు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షిర్డీ చేరుకుంటాయి. హోటల్ లో ప్రెష్ అప్ అయ్యాక సాయినాథుడి దర్శనం చేసుకోవాలి. సాయంత్రం 4 గంటలకు షిర్డీ నుంచి బస్సులు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

సిటీలోని పికప్ పాయింట్లు..
దిల్‌షుక్‌నగర్, బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్ బీ, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి బస్సులు సాయంత్రం షిర్డీకి బయలు దేరతాయి

మినాయింపులు..
ఈ టూర్ లో బాబా దర్శన టికెట్ సదుపాయాన్ని చేర్చలేదు. అంటే బాబా దర్శనం కోసం ముందుగానే భక్తులు టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. మధ్యహ్న భోజనం ఏర్పాట్లు కూడా భక్తులు స్వంతంగానే చూసుకోవాలి. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Shirdi
tour
Hyderabad
Telangana tourism
TSRTC Buses

More Telugu News