YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

  • బుధవారంతో ముగిసిన రిమాండ్ గడువు
  • నాంపల్లి సీబీఐ కోర్టులో ఉదయ్ ని హాజరుపరిచిన అధికారులు
  • మరో 14 రోజులు రిమాండ్ లోనే ఉదయ్ కుమార్  
Uday Kumar Reddy Remand Extended for 14 Days

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ బుధవారంతో ముగియనుండడంతో అధికారులు మరోమారు కోర్టును ఆశ్రయించారు. ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో అతని రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షాలను తారుమారు చేశారనే అభియోగాలతో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం నిందితుడిని నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించింది.

More Telugu News