Saitej: దూసుకుపోతున్న 'విరూపాక్ష' .. 4 రోజుల్లో 50 కోట్ల క్లబ్ లోకి!

  • ఈ నెల 21న రిలీజైన 'విరూపాక్ష'
  • తొలి రోజున 12 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • రెండో రోజుతో లభించిన 28 కోట్ల గ్రాస్
  • మూడో రోజుతో కలుపుకుని 44 కోట్ల గ్రాస్ 
  • నాల్గో రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ
Virupaksha Movie Update

ఈ రోజుల్లో రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను థియేటర్స్ లో కూర్చోబెట్టడం చాలా కష్టమైన విషయం. కంటెంట్ ఏ మాత్రం లూజ్ గా ఉన్నా, వెంటనే అక్కడి నుంచి ఆడియన్స్ జారిపోతున్నారు. టైట్ కంటెంట్ తో ప్రేక్షకులను చివరివరకూ కదలకుండా కూర్చోబెట్టే సినిమాలు కొన్నే వస్తున్నాయి. అలాంటి వాటిలో 'విరూపాక్ష' ఒకటిగా చెప్పుకోవచ్చు.

సాయితేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. కథాకథనాల పరంగా .. నిర్మాణ విలువల పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. 

 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 12 కోట్లు .. రెండో రోజు 28 కోట్లు .. మూడో రోజు 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాల్గో రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సాయితేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా .. ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలవడం విశేషం.

More Telugu News