kerala: వీడియో గేమ్ ఆడుతుంటే పేలిన స్మార్ట్ ఫోన్.. కేరళలో ఎనిమిదేళ్ల బాలిక మృతి

Eight year old girl dies as mobile explodes while watching video in Kerala
  • సోమవారం రాత్రి త్రిస్సూర్ జిల్లాలో ఘటన
  • ఫోన్ చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా పేలుడు
  • అక్కడికక్కడే చనిపోయిన చిన్నారి
గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడడంతో వేడెక్కిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది.. దీంతో గేమ్ ఆడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఫోరెన్సిక్ తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని తిరువిల్వామలకు చెందిన ఆదిత్యశ్రీ అనే చిన్నారి 3వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి తండ్రి మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కూర్చుంది. చాలాసేపు గేమ్స్ ఆడడంతో ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది. ఫోన్ కూడా బాగా వేడెక్కింది. అయినా ఆదిత్యశ్రీ గేమ్ ఆడడం ఆపలేదు. ఫోన్ కు చార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడుతుండగా.. మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆదిత్యశ్రీ తీవ్ర గాయాలపాలై చనిపోయింది.  
kerala
mobile phone blast
8 year kid death

More Telugu News