Boppraju Venkateswarlu: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం: ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల నిరసన బాట
  • మలి దశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందన్న బొప్పరాజు
  • ఉద్యమం తీవ్రమైతే బాధ్యత తమది కాదని స్పష్టీకరణ
  • ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం 
Bopparaju talks about employees agitation

ఏపీలో డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యాచరణ కొనసాగుతోంది. దీనిపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యమం తీవ్రమైతే తాము బాధ్యులం కాదని అన్నారు. 

డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యంలో, ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం అవుతున్నట్టు బొప్పరాజు వెల్లడించారు. 

పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పాత బకాయిలు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియడంలేదని వాపోయారు.

More Telugu News