Harish Rao: ఈ సభకు వచ్చిన వాళ్లలో సగం మంది కూడా నిన్నటి అమిత్ షా సభలో లేరు: హరీశ్ రావు

Harish Rao comments on Amit Shas chevella meeting
  • బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ స్టాండర్డ్ సర్కార్ అన్న హరీశ్ రావు 
  • ఎన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య
  • కేసీఆర్ ప్రభుత్వం చేసింది చెప్పాలని కార్యకర్తలకు పిలుపు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్నటి చేవెళ్ల బహిరంగ సభ పైన, బీజేపీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సోమవారం విమర్శలు గుప్పించారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కల్లూరు సభకు వచ్చిన వాళ్లలో సగం మంది కూడా నిన్నటి అమిత్ షా సభలో లేరని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని, కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలని అన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ మాటలు ఎండమావే అన్నారు. నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయని అంబేద్కర్ గారు చెప్పారని, కాబట్టి మీరంతా మన ప్రభుత్వం చేసింది చెప్పాలన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో... ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే అంత పండుతుందన్నారు. కరవు అనే పదాన్ని సీఎం కేసీఆర్ డిక్షనరీ నుంచి తొలగించారన్నారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దని, మనది రైతు ప్రభుత్వమనీ అన్నారు.
Harish Rao

More Telugu News