JC Diwakar Reddy: రాయలసీమను తెలంగాణలో కలపాలి: జేసీ దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy demands to merge Rayalaseema into Telangana
  • సీమను తెలంగాణలో కలిపితేనే నీటి కష్టాలు తీరుతాయన్న జేసీ 
  • తెలంగాణలో సీమను కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు లేవని వ్యాఖ్య
  • ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సంతోషమేనన్న జేసీ
రాయలసీమను తెలంగాణలో కలపాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పుడే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కావచ్చని... కానీ, కలపడం మాత్రం సులభమేనని అన్నారు. రాయలసీమను తెలంగాణలో కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవని చెప్పారు. కొంతమంది ప్రత్యేక రాయలసీమ అంటున్నారని... ఒకవేళ ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సంతోషమేనని అన్నారు. జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాయలతెలంగాణ అనే ఆప్షన్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
JC Diwakar Reddy
Rayalaseema
Telangana
Telugudesam

More Telugu News