వైరల్ వీడియో.. పెట్రోల్ తో కారును కడిగిన మహిళ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైరల్ వీడియో.. పెట్రోల్ తో కారును కడిగిన మహిళ!

women washes car with petrol netizens stunned
  • బంక్ లో కారును క్లీన్ చేసిన మహిళ
  • ఓ కారులో నుంచి సీక్రెట్ గా రికార్డు చేసిన వ్యక్తి
  • ట్విట్టర్ లో షేర్ చేసిన ‘ఔట్ ఆఫ్ కాన్ టెక్ట్స్ హ్యూమన్ రేస్’
ఓ మహిళ తన కారును కడుగుతోంది.. అద్దాలను, తర్వాత లైట్లను ఇలా ఓ పద్ధతిగా శుభ్రం చేసుకుంటూ పోతోంది. ఇదంతా ఓ కారులో నుంచి ఒకరు రహస్యంగా రికార్డు చేస్తున్నారు.. ఏమిటిదంతా అనుకోవద్దు.. ఆమె కారును శుభ్రం చేస్తున్న మాట నిజమే. కానీ నీటితో కాదు పెట్రోల్ తో!! అది కూడా పెట్రోల్ బంక్ లో!!

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచిన వీడియోను కోట్ల మంది చూశారు. ఈ ఘటన ఏ దేశంలో జరిగిందో తెలియదు. ‘ఔట్ ఆఫ్ కాన్ టెక్ట్స్ హ్యూమన్ రేస్’ అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ అయ్యింది.

మన దేశంలో అయితే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, లేదా డీజిల్ పోయడానికి సిబ్బంది ఉంటారు. చాలా దేశాల్లో డబ్బు కట్టి పెట్రోల్ ను ఎవరికి వాళ్లే కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలోనే పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ మహిళ పెట్రోల్ కొట్టుకుని.. ఆ తర్వాత అదే గన్ తో.. శుభ్రంగా పెట్రోల్ తో కారు కడుక్కుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వింతలు బయటపడుతున్నాయి.

అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన యూజర్.. ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. దీంతో అది పెట్రోల్ కాదని, నీళ్లు అని కొందరు.. గ్యాసోలిన్ కావచ్చని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. నీళ్ల కోసం అలాంటి పైప్ ఎందుకు ఉపయోగిస్తారని, సీక్రెట్ గా ఎవరో ఎందుకు రికార్డ్ చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలానే కొందరు మహిళలు పెట్రోల్ తో క్లీన్ చేసిన విషయాన్ని, ఆక్సిజన్ సిలిండర్ తో గాలి కొట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఫొటోలతో సహా పోస్ట్ చేస్తున్నారు.
Advertisement
women washes car with petrol
Twitter
Viral Videos

More Telugu News