YS Sharmila: పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అరెస్ట్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

  • నిరుద్యోగ సమస్యలపై ధర్నా చేసేందుకు బయల్దేరిన  షర్మిల 
  • షర్మిలను అడ్డుకున్న పోలీసులు
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
YS Sharmila arrest

హైదరాబాద్ లోని షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ విషయంలో సిట్ అధికారును కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కారులో ముందుకు వెళ్లేందుకు ఆమె యత్నించారు. ఈ క్రమంలో కారును చుట్టుముట్టిన పోలీసులు, డ్రైవర్ ను లాగి పడేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల కారు నుంచి కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టేస్తూ ముందుకు సాగేందుకు యత్నించారు. ఎస్సై, కానిస్టేబుల్ ను నెట్టేశారు.

ఈ క్రమంలో ఆమెను మహిళా పోలీసులు గట్టిగా పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలపై సెక్షన్ 330, 353 కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నట్టు కేసు బుక్ చేశారు.

More Telugu News