Telangana: ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Telangana student dies in philippines
  • తల్లిదండ్రులకు సమాచారం అందించిన కాలేజీ యాజమాన్యం
  • ఎనిమిది నెలల క్రితం మెడిసిన్ చదువుల కోసం వెళ్లిన మణికాంత్
  • మణికాంత్ స్వగ్రామం భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి
తెలంగాణకు చెందిన విద్యార్థి మణికాంత్ ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మణికాంత్ ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతున్నాడు. అతని మృతికి సంబంధించిన సమాచారాన్ని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. ఇతని స్వగ్రామం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామం. మణికాంత్ ఎనిమిది నెలల క్రితం మెడిసిన్ చదువుల కోస ఫిలిప్పీన్స్ వెళ్లాడు. మణికాంత్ మృతితో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Telangana
student

More Telugu News