Mallu Bhatti Vikramarka: రేవత్ రెడ్డికి మద్దతుగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka came into support for Revanth Reddy
  • మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్-ఈటల మధ్య వివాదం
  • ఈటల చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేదన్న భట్టి
  • తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం
పేదల కోసం, రైతుల కోసం, నీతి నిజాయతీలతో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి-ఈటల రాజేందర్ వ్యవహారంపై భట్టి స్పందించారు. ఈ వివాదంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. 

కేసీఆర్ అవినీతిలో ఈటల రాజేందర్ భాగస్వామి అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈటల చెప్పేదానికి, చేసే దానికి పొంతన లేదని అన్నారు. వీళ్లు చేసిన తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీపై అభాండాలు వేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

మునుగోడు వివాదం బీజేపీ, బీఆర్ఎస్ అజెండాలో భాగమేనని భట్టి అన్నారు. దీన్ని తాము ఖండిస్తున్నామని, అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Eatala Rajendar
Congress
BJP
BRS

More Telugu News