వైసీపీలో చేరుతున్న క్రికెటర్ అంబటి రాయుడు?
- రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ గతంలోనే చెప్పిన రాయుడు
- తాజాగా సీఎం జగన్ పై ప్రశంసల జల్లు
- రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి
తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. రాయుడిని బీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కాపు సామాజికవర్గానికి చెందినవాడు. దీంతో ఆయన జనసేనలో కూడా చేరే అవకాశాలున్నాయని పలువురు భావించారు. టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు జగన్ పై ప్రశంసలు కురిపించడంతో... ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఏం జరగబోతోందో వేచి చూడాలి.