Chandrababu: మార్కాపురంలో తన పుట్టినరోజు వేడుకల్లో స్వయంగా భోజనాలు వడ్డించిన చంద్రబాబు

Chandrababu serves lunch to people in his birthday celebrations
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • ప్రస్తుతం మార్కాపురంలో ఉన్న టీడీపీ అధినేత
  • కేక్ కట్ చేసి ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకున్న వైనం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మార్కాపురలో ఉన్నారు. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో చంద్రబాబు అక్కడే వేడుకలు జరుపుకున్నారు. 

చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. పిల్లలు టీడీపీ అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. 

పుట్టినరోజు సందర్భంగా, మహిళలతో ఆత్మీయ సదస్సు లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. 

మహిళలతో ఆత్మీయ సమావేశ వేదికపై ఐడియాలజీ కాన్సెప్ట్ నోట్ ను సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
Chandrababu
Birthday
Markapuram
TDP
Prakasam District

More Telugu News