Atiq Ahmed: అతీక్ అహ్మద్ హత్య సీన్ ‘రీ కన్ స్ట్రక్షన్’.. వీడియో ఇదిగో!

Cops Take Atiq Ahmeds Killers To Crime Spot and Recreates Murder Scene
  • ప్రయాగ్ రాజ్ లో హత్య జరిగిన ప్రాంతంలో సీన్ రీక్రియేట్ చేసిన పోలీసులు
  • జ్యుడీషియల్ కమిషన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య నిర్వహణ
  • ముగ్గురు హంతకులు కూడా క్రైమ్ స్పాట్‌కు..
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఆష్రఫ్ అహ్మద్.. గత వారం హత్యకు గురైన విషయం తెలిసిందే. రిపోర్టర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు నిందితులు.. పోలీసుల సమక్షంలోనే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపి వాళ్లను చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో హత్య జరిగిన ప్రాంతంలో ఘటనను రీక్రియేట్ చేశారు. జ్యుడీషియల్ కమిషన్, ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో, భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఇందుకోసం పోలీసులు అతీక్ అహ్మద్ హంతకులను క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లారు. హత్య ఘటనను మొత్తం పునఃసృష్టించారు

అతీక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను పోలీసులు తీసుకుని రావడం, వారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించడం, ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడం.. వారిని పోలీసులు పట్టుకోవడం.. తదితరాలను రీ క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
Atiq Ahmed
scene reconstruction
Recreate Murder Scene
Prayag raj
Judicial Commission

More Telugu News