Sai Tej: చరణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడితో సాయితేజ్!

Saitej in Sampath Nandi Movie
  • అనుకోకుండా సాయితేజ్ కి వచ్చిన గ్యాప్
  • ఇక పై వరుస సినిమాలు చేయాలనే ఆలోచన 
  • వరుసగా కథలు వింటున్న సాయితేజ్ 
  • సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చినట్టుగా టాక్

సాయితేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విరూపాక్ష' రెడీ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇక వరుస ప్రాజెక్టులను సాయితేజ్ లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. తన దగ్గరికి వచ్చే కథలను వినడానికి ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడని సమాచారం.   

ఈ నేపథ్యంలోనే సంపత్ నంది ఆయనకి ఒక కథను వినిపించాడనీ, ఇంతవరకూ తాను చేసిన సినిమాలకు ఈ కథ భిన్నంగా ఉండటంతో, సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. 

ఇంతవరవరకూ సంపత్ నంది చేసిన సినిమాల్లో 'రచ్చ ' .. 'బెంగాల్ టైగర్' భారీవిజయాలను అందుకున్నాయి. మాస్ యాక్షన్ సినిమాలను ఆయన బాగా తీయగలడనే పేరు తెచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. సాయితేజ్ తో చేసే సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News