Bandi Sanjay: నవంబర్ లో కేసీఆర్ రిటైర్ అవుతారు: బండి సంజయ్

KCR will retire in November says Bandi Sanjay
  • కేసీఆర్ కు అహంకారం పెరిగిందన్న బండి సంజయ్
  • రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపాటు
  • గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ పని చేసిందని విమర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగాన్ని కూడా కేసీఆర్ అవమానిస్తున్నారని చెప్పారు. నవంబర్ లో బీఆర్ఎస్ కథ సమాప్తం అవుతుందని, కేసీఆర్ రిటైర్ అవుతారని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మరో రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు చేతులు కలిపాయని... కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ పని చేసిందని అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Bandi Sanjay
BJP
KCR
BRS

More Telugu News