Sensex: వరుసగా మూడో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • 159 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 41 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల ప్రభావం
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 59,567కి పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 17,618కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.90%), భారతి ఎయిర్ టెల్ (0.77%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.71%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.65%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.35%), ఇన్ఫోసిస్ (-2.28%), విప్రో (-1.80%), ఎన్టీపీసీ (-1.71%).

More Telugu News