Vijay: 'వీరసింహారెడ్డి ' డైరెక్టర్ తో విజయ్!

Vijay in Gopichand Malineni Movie
  • రూట్ మార్చిన కోలీవుడ్ హీరోలు 
  • టాలీవుడ్ డైరెక్టర్లతో సెట్ అవుతున్న ప్రాజెక్టులు 
  • గోపీచంద్ మలినేనికి విజయ్ గ్రీన్ సిగ్నల్ 
  • చందూ మొండేటిని లైన్లో పెట్టిన సూర్య
  • వెంకీ అట్లూరికి ఓకే చెప్పిన దుల్కర్
కొంతకాలం క్రితం వరకూ కోలీవుడ్ స్టార్ హీరోలు తాము అక్కడ చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేవారు. అవి అనువాద సినిమాలుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఇక్కడ కూడా బాగానే ఆడేవి. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. 

అనువాదమనడానికి అవకాశం లేకుండా కోలీవుడ్ హీరోలు నేరుగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ చేసిన సినిమాలను తమిళంలోను రిలీజ్ చేస్తున్నారు. దీనివలన ఇది తెలుగు సినిమా అనే ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. తమ హీరో సినిమా అనే ఫీలింగే అక్కడ ఉంటుంది. 

ఈ క్రమంలోనే ధనుశ్ నుంచి 'సార్' .. విజయ్ నుంచి 'వారసుడు' వచ్చాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ ను సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల 'వీరసింహారెడ్డి' హిట్ చిత్రాన్ని చేసిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. అలాగే చందూ మొండేటితో సూర్య .. వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్ సినిమాలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. 
Vijay
Gopichand Malineni
Chandu Mondeti
Surya

More Telugu News