ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం ఏదంటే..!

Worlds Richest City Has Over 3 Lakh Millionaires
  • న్యూయార్క్ లోనే 3.4 లక్షల మంది మిలియనీర్లు
  • 2.9 లక్షల మంది మిలియనీర్లతో రెండో స్థానంలో టోక్యో
  • టాప్ 97 నగరాల జాబితా విడుదల చేసిన హెన్లీ అండ్ పార్ట్ నర్స్
ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ సిటీ మరోమారు నిలిచింది. ఈ భూమ్మీద ఎక్కువ మంది సంపన్నులు ఈ నగరంలోనే నివసిస్తున్నారని వెల్త్ ట్రాకర్ కంపెనీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ వెల్లడించింది. ఈ మేరకు  2023 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ మళ్లీ టాప్ లో నిలిచింది.

అమెరికాలోని న్యూయార్క్ లో ఏకంగా 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. వంద మిలియన్ డాలర్లకు పైబడి (సెంటి మిలియనీర్స్) ఆస్తులు ఉన్న వారి సంఖ్య 724 కాగా 58 మంది బిలియనీర్లు కూడా ఈ నగరంలో ఉంటున్నారని వెల్లడించింది. అమెరికాలోని నాలుగు సిటీలు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలిస్, షికాగో లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 97 నగరాలకు చోటు దక్కింది. న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఇక్కడ 2.90 లక్షల మంది మిలియనీర్లు నివసిస్తున్నారని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తన రిపోర్టులో పేర్కొంది.

మూడో స్థానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో దక్కించుకుంది. ఈ సిటీలో 2.85 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరొందిన లండన్.. ప్రస్తుత జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. లండన్ తర్వాతి స్థానంలో సింగపూర్ నిలిచింది. చైనా రాజధాని బీజింగ్, షాంఘైలకూ ఈ జాబితాలో చోటు దక్కింది.
Go Back to Shorts
Wealthiest cities
New York
millionaires
San Francisco
Tokyo
Singapore
London

More Telugu News