TTD: శ్రీవారి దర్శనం, ఇతర సేవల టికెట్ల క్యాలెండర్ ను విడుదల చేసిన టీటీడీ

  • ప్రత్యేక దర్శనం, వివిధ సేవల టికెట్లను ఆన్ లైన్ లో ఉంచుతున్న టీటీడీ
  • అన్ని తేదీలతో క్యాలెండర్ విడుదల
  • భక్తులకు ఉపయుక్తంగా ఉండనున్న క్యాలెండర్
TTD releases various tickets issuing calendar

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను టీటీడీ నెలకోసారి ఆన్ లైన్ లో విడుదల చేస్తుండడం తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో క్యాలెండర్ విడుదల చేసింది. తిరుమల వెంకన్న భక్తులకు ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ నెలలో ఏ తేదీన ఏ టికెట్లు విడుదల చేస్తారో భక్తులకు క్యాలెండర్ రూపంలో అందుబాటులోకి వచ్చినట్టయింది.

ఏప్రిల్ 20
ఉదయం 10 గంటలకు జులై మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల విడుదల. ఇవి లక్కీడిప్ విధానంలో కేటాయించే టికెట్లు.
ఏప్రిల్ 20
ఉదయం 11.30 గంటలకు జులై మాసానికి సంబంధించిన ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల విడుదల.
ఏప్రిల్ 21
ఉదయం 10 గంటలకు జులై నెల అంగప్రదక్షిణం టికెట్ల విడుదల.
ఏప్రిల్ 21
మధ్యాహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్ల జారీ.
ఏప్రిల్ 24
ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లు కలిగిన శ్రీవారి భక్తులకు దర్శన టికెట్ల విడుదల. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టోకెన్ల విడుదల.
ఏప్రిల్ 25
ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ల విడుదల.
ఏప్రిల్ 26
ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించి తిరుమలలోని వసతి గదుల కోటా విడుదల.
ఏప్రిల్ 27
ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించి తిరుమలలోని వసతి గదుల కోటా విడుదల.

More Telugu News