Tollywood: సలార్‌‌ నుంచి సాలిడ్ సర్ ప్రైజ్!

Prabhas starrer Prasanth Neel film Salaar to release in two parts villain Devaraj confirms
  • రెండు భాగాలుగా రానున్న ప్రభాస్–ప్రశాంత్ నీల్ చిత్రం
  • కన్నడ నటుడు దేవరాజ్ వెల్లడి
  • హీరోయిన్ గా నటిస్తున్న శ్రుతి హాసన్
రాధేశ్యామ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో నిరాశ పరిచిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముందుగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖరు నుంచి చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సలార్‌‌ సినిమాపై ప్రభాస్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. బాహుబలి, కేజీఎఫ్ మాదిరిగా ఈ చిత్రం రెండు భాగాల్లో తెరపైకి రానుంది. చిత్ర బృందం దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. 

కానీ, సలార్ లో కీలక పాత్ర చేస్తున్న కన్నడ నటుడు దేవరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. మొదటి భాగంలో కంటే  రెండో పార్ట్‌లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్నారు. ఇక, సలార్ లో  ప్రభాస్‌ రెండు పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి  నెగిటివ్‌ షేడ్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. దేవా అనే పవర్‌‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. కేజీఎఫ్ లోనూ ప్రశాంత్ నీల్.. యష్ ను  నెగిటివ్‌ క్యారెక్టర్‌‌లోనే చూపెట్టి హీరోయిజాన్ని ఎలివేట్ చేసి సక్సెస్ కొట్టారు. 

గతంలో ‘బిల్లా’ చిత్రంలో ప్రభాస్ నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇన్నాళ్ల తర్వాత రెబల్ స్టార్ మళ్లీ అలాంటి పాత్ర చేస్తున్నారంటే సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.  ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
Tollywood
Prabhas
salar
movie
two parts

More Telugu News