CBI: భాస్కర్ రెడ్డి అరెస్టు.. పులివెందులలో టెన్షన్ టెన్షన్

  • నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా నేతలు
  • పులివెందుల, కడపలో శాంతియుత నిరసన ర్యాలీ
  • భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్న సీబీఐ అధికారులు
CBI ARREST YS BHASKAR REDDY IN PULIVENDULA OVER YS VIVEKA MURDER CASE

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ రోజు (ఆదివారం) ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే! భాస్కర్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ కు తరలిస్తున్న అధికారులు.. మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ఆయనను ప్రవేశపెడతామని చెప్పారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో పులివెందుల చేరుకున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పులివెందులతో పాటు కడపలోనూ నిరసన ర్యాలీకి వైసీపీ జిల్లా అధిష్టానం పిలుపునిచ్చింది.

భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు ఇవీ..

  • వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు
  • 120 బి కుట్ర, 302 హత్య, 201 ఆధారాలను చెరిపేయడం సెక్షన్ల కింద కేసు నమోదు

అరెస్టు సందర్భంగా ఎప్పుడేం జరిగిందంటే..
  • ఆదివారం తెల్లవారుజామున ముఖేష్ నేతృత్వంలో సీబీఐ అధికారుల బృందం పులివెందుల చేరుకుంది.
  • ఉదయం 5:30 గంటల ప్రాంతంలో భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు
  • 6:10 గంటల నుంచి భాస్కర్ రెడ్డి ఇంట్లో అధికారుల సోదాలు, అరెస్ట్ మెమో తయారుచేసిన అధికారులు
  • తన లాయర్ ను ఇంట్లోకి అనుమతించాలని, మెమోలో ఏముందో తెలుసుకోవాలని భాస్కర్ రెడ్డి పదేపదే కోరారు. అయితే, అధికారులు తిరస్కరించారు.
  • ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకున్నారు
  • 8:00.. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్య శ్రీలక్ష్మి, పి.జనార్ధన్ రెడ్డికి అధికారులు సమాచారం ఇచ్చారు
  • 8:30.. భాస్కర్ రెడ్డి మొబైల్ ఫోన్ ను సీజ్ చేసిన అధికారులు
  • 9:00.. భాస్కర్ రెడ్డిని తీసుకుని పులివెందుల నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన సీబీఐ అధికారులు
  • 9:30.. పులివెందులలో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన వైసీపీ

More Telugu News